అడ్వాన్స్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపులతో దేశీయ బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. దీంతో ఈనెల 20న నాలుగేండ్లకు పైగా గరిష్టాన్ని తాకుతూ రూ.1.46 లక్షల కోట్లకు చేరింది. 2019 ఏప్రిల్ 23 తర్వాత ఈ స్థాయిలో నగదు లేకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బ్యాంకులు మార్జినల్ స్టాండింగ్ సదుపాయం (ఎంఎస్ఎఫ్) కింద రికార్డు స్థాయిలో రూ.1.97 లక్షల కోట్లను రుణంగా తీసుకోవాల్సి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది.