టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు. జగన్ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. ముష్టి రూ.300 కోట్లకు ఆశపడతారా?" అని వ్యాఖ్యానించారు.