స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అన్యాక్రాంతం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్లు చంద్రబాబు పాలన సాగిందని విమర్శించారు.