ఒడిశాలో బయటపడిన స్క్రబ్ టైఫస్ వైరస్ తాజాగా మహారాష్ట్రకూ పాకింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 16 మంది ఈ వైరస్ తో బాధపడుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో మరో ఐదుగురు మృతి చెందినట్లు కేంద్రం తెలపడంతో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.