అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తి ఈ రోజు అవినీతిపై జగన్ నీతులు చెబుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టారని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రస్తుతం పదో బెయిల్ వార్షికోత్సవం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తి ఈ రోజు అవినీతిపై నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఇది అక్రమ కేసు అన్నారు. అవినీతి కేసులో పదేళ్లు బెయిల్ పైన బయట ఉన్న జగన్, ఇప్పుడు ప్రజాసేవకుడైన చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపించారన్నారు.