ముంబై విమానాశ్రయాన్ని అక్టోబర్ 17న మూసివేస్తున్నట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ పనుల కారణంగా ఆ రోజు 6 గంటల పాటు మూసివేయబడుతుంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్షాకాలం తర్వాత రెండు రన్‌వేల వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా అక్టోబరు 17న రెండు రన్‌వేలను ఆరు గంటల పాటు మూసివేస్తామని.. ఇందుకు సంబంధించి ఆరు నెలల ముందుగానే ఎయిర్మెన్లకు నోటీసులు కూడా జారీ చేసింది.