కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఆయనకు చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. నేడు బిలాస్పూర్లో నిర్వహించనున్న ‘అవాస్ న్యాయ్ సమ్మెళన్ ప్రోగ్రాం’లో పాల్గొననున్నారు. అనంతరం ‘ముఖ్యమంత్రి గ్రామీణ్ అవాస్ న్యాయ్ యోజన(MGANY)’ను ప్రారంభించి, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.