శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించిందని ఆరోపించారు. ఆయనకు జైలులో సరైన భద్రత లేదని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబుకు భద్రత కలిగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.