ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కౌంటర్ ఇచ్చారు. భారత్-కెనడా మధ్య ఉద్రిక్తలను ప్రస్తావించిన జైశంకర్.. ట్రూడోపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘స్వేచ్ఛ పేరుతో ఎలాగైతే చాలా పనులు జరుగుతున్నాయో అదే విధంగా మార్కెట్ పేరుతో కూడా జరుగుతాయి’’అని అన్నారు. అనంతరం భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు.