వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ఇప్పటికే పార్టీల ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తిరుగులేదని తెలుస్తోంది. వాషింగ్టన్ పోస్టు, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో బైడెన్ కంటే ట్రంప్ దాదాపు 10 పాయింట్లు ముందున్నట్లు తేలింది. అయితే ఈ సర్వేను పలువురు రాజకీయ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు.