ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసుపై వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. చంద్రబాబును ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు లాయర్ కోర్టును కోరారు. తొలుత కస్టడీ పిటిషన్పై విచారణ జరపాలని విన్నవించారు. అయితే దానికి మెమో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మెమో దాఖలుకు సమయం ఇవ్వాలని అర్థించారు.అయితే బెయిల్ పిటిషన్పై వాదనలు వినాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు.