మధ్యప్రదేశ్లో తొలిసారి ఓటేయనున్న యువత చాలా అదృష్టవంతులని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో 20ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వమే ఉంది. అంటే ఇప్పుడే తొలిసారి ఓటేయనున్న వారు కేవలం బీజేపీ పాలననే చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వపు నీచపు పాలనను చూడనందుకు వారు అదృష్టవంతులు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో వేరే స్థాయికి తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్లింది’’అని అన్నారు.