తమిళనాడు-కర్ణాటక మధ్య కొనసాగుతున్న కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతూ మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవేగౌడ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘రాష్ట్రంలో నీటి పరిస్థితిని దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని పంపాలని కేంద్రాన్ని కోరుతున్నాను. నేను రాజకీయాలు, అధికారం కోరుకోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం’’అని అన్నారు.