రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో మెజార్టీ పథకాలు మహిళ పేరిటే అమలవుతున్నాయని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చెప్పారు. 86 శాతం మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్‌ను తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవడానికి దిశ చట్టం తీసుకువస్తే.. మహిళలపై అరాచకాలు జరగకుండా దిశ యాప్‌ను తీసుకువచ్చారన్నారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ఇలాంటి పదవులకు గానూ రాజ్యాంగం కల్పించిన అవకాశం కంటే ఎక్కువగా సీఎం వైయస్ జగన్ కల్పించారని చెప్పారు. మహిళలు గతంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడేవారని, ఈరోజు వైయస్ జగన్ ప్రభుత్వంలో మహిళలు వారి కళ్ల మీద వారు నిలబడుతున్నారన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి, సొంతింటి కలను సహకారం చేస్తున్న సీఎం వైయస్ జగన్‌కు మహిళలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చెప్పారు.