ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణికుల ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన కలకలం రేపింది. కొత్తగా పెళ్లైన జంట పూర్వాంచల్ హైవేపై కారులో రొమాన్స్ చేస్తుండగా, స్థానిక టోల్ ప్లాజా సిబ్బంది అశుతోష్ సీసీ కెమెరా ద్వారా వారి వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోను చూపించి డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చినప్పటికీ, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అశుతోష్ ఇలాంటి వీడియోలు ఎన్నో రికార్డ్ చేసినట్లు విచారణలో తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa