మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పట్టపగలే ఓ చిరుత నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ప్రజల భయాందోళనల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి, చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa