పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలో కూలీ పనులు చేసుకునే రామ్ సింగ్, నసీబ్ కౌర్ దంపతులు రూ.200కు లాటరీ టికెట్ కొనుగోలు చేయగా.. రూ.1.5 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. ఈ విషయం తెలియడంతో, తమకు హాని జరుగుతుందేమోనని భయపడి, వారు తమ ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యారు. పోలీసులు వారిని సంప్రదించి, రక్షణ కల్పిస్తామని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇంటికి తిరిగి రావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa