ఆధార్ కార్డులపై మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఆరోపణలను యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) తాజాగా ఖండించింది. ఆధార్ కార్డు ప్రపంచంలో అత్యంత నమ్మకమైనదని పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధార్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. IMF, వరల్డ్ బ్యాంక్ ఆధార్‌ను ప్రశంసించాయని గుర్తు చేసింది. అంతకు ముందు 'వేడి వాతావరణంలో ఆధార్ బయోమెట్రిక్ టెక్నాలజీ నమ్మదగినది కాదని మూడీస్ సంస్థ ఆరోపించింది.