అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అనే వ్యక్తి మిలియనీర్. ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆయన వయసు ప్రస్తుతం 40. అయితే 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు ఆయన ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నాడు. తన కుమారుడి రక్తాన్ని తన శరీరంలో ఎక్కించుకున్నాడు. రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాడు. ఏడాదికి ఈ చికిత్స నిమిత్తం రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్నాడు.