మణిపూర్లో జరిగిన మరో దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. జులై 6న మైతీ తెగకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయి కనిపించకుండా పోయారు. తాజాగా అక్కడ ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. దీంతో వారిద్దరూ హత్యకు గురైనట్లు కనిపించే ఫొటోలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. అటవీ ప్రాంతంలో వీరిని బంధించిన ఫొటోలు, వీరి వెనుక సాయుధులు నిలబడ్డ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.