తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు సోమవారం విజయవాడ మహాధర్నాకు వెళ్తుండగా వివిధ జిల్లాలకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. మంగళగిరి పోలీస్స్టేషన్ కు ప్రకాశం, అనంతపురం, పల్నాడు జిల్లాలకు చెందిన 65 మంది తీసుకురాగా వారిని వివిధ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంగన్వాడీలను విడుదల చేయాలని స్టేషన్ వద్ద ధర్నా చేశారు.