జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇవ్వగా ముందస్తు చర్యలలో భాగంగా సోమవారం జనసేన నాయకులను చెరుకుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మత్తి భాస్కరరావు మాట్లాడుతూ అరెస్టులతో జనసైనికులు భయ పెట్టలేరన్నారు. అక్రమ ఇసుక మైనింగ్ గురించి జిల్లా కలెక్టర్, ఎస్పీ కు, మైనింగ్ అధికారులకు ఎన్నోసారు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందన్నారు.