అసెంబ్లీలో ఏకపక్షంగా జిపిఎస్ ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు, పల్నాడు కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేపట్టారు. గుంటూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో నిరసన తెలిపి, అనంతరం అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట బైటాయించి ఆందోళన కొనసాగించారు. అనంతరం ఫ్యాప్టో నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.