వర్షాభావం కారణంగా మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఆరు తడి పంటల సాగుకైనా ప్రభుత్వం నీటి ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ కోరారు. ఈ మేరకు ముప్పాళ్ళ తహశీల్దార్ భవానీ శంకర్‌కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టులో ఖరీఫ్ సీజన్ ముగిసి రైతులు తీవ్ర అందోళనలో ఉన్నారన్నారు.