కళ్యాణదుర్గం సానిటరీ ఇన్స్పెక్టర్ హరి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, పట్టణ పరిధిలో ఐదుకల్లు రోడ్డులో కల చెరువులోకి గంబూసియా చేపలను వదలడం జరిగింది. ఈ చేపలు దోమల లార్వా లను ఆహారంగా తీసుకొని, లార్వా లు లేకుండా చేసి, దోమల నివారణకు తొడ్పడు తాయన్నారు. అధికారులు సత్య నారాయణ, డాక్టర్ రాజేష్, తిరుపాలయ్య పాల్గొన్నారు.