బాలికలు, మహిళలపై హింస, వేధింపులు పెరిగాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శిప్రియాంక ఆరోపించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బాలికలు, మహిళలపై హింస అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యాన విశాఖ కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ జిల్లాలో మద్యం, మత్తు పదార్థాలు అమ్మకాలతో మహిళల పట్ల హింస పెరుగుతుందన్నారు.