విశాఖ బీచ్ రోడ్డులోని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఆధునికీకరించిన మెరైన్ మ్యూజియాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు 250 రకాల జలచరాల నమూనాలను శాస్త్రీయంగా మ్యూజియంలో భద్ర పరిచారన్నారు.