ఆన్లైన్ షాపింగ్ సైట్ లో ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు మెసేజ్ రాగా, పలు దఫాలుగా రూ. 70 లక్షలు అగంతకులకు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయినట్లు ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి సోమవారం జిల్లా ఎస్పీకు ఫిర్యాదు చేశారు. తనకు హాంగ్కాంగ్ కరెన్సీ రూపంలో రూ. 2, 69, 28, 000 నగదు ప్రైస్ మనీ గా వస్తుందని ఈ నగదులో కొంత డబ్బులు చెల్లించాలని అగంతకులు తన వద్ద నగదును దోచినట్లు బాధితుడు తెలపగా, విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు.