నాతవరం మండలం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చింతాడ సత్యనారాయణ పాస్ పుస్తకాలు జారీకి రూ. 2000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నాతవరం తహసిల్దార్ కార్యాలయం లో ఫోన్ పే ద్వారా సోమవారం రెండు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ ఎస్పీ శ్రావణి, డి. ఎస్. పి రమ్యకు వీఆర్వో పట్టుపడ్డారు. రెడ్డి సన్యాసినాయుడు ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు