పులుల సంఖ్యతో పాటు అడవులలో అవి సంచరిస్తున్న ప్రాంతం కూడా పెరుగుతున్నందున ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమం అభివృద్ధి అంశాలపై సంబంధిత అధికారులతో సోమవారం ఒంగోలు లోని కలెక్టరేట్ లో ఆయన సమీక్షించారు.గిరిజనులను రీలోకెట్ చేయటంలో వారికి అవసరమైన జీవనోపాధి చూపాలన్నారు.