చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. తాజాగా ఇండియా ఖాతాలోకి మరో పతకం చేరింది. సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. మహిళల 'ఐఎల్‌సీఏ - 4' కేటగిరీలో 11 రేసుల తర్వాత రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇండియా ఇప్పటి వరకు 12 పతకాలను కైవసం చేసుకుంది. ఇందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa