ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ సినిమాకు చేసిన విశిష్ఠ సేవలకు గాను వహిదా రెహమాన్‌ను ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. చారిత్రక మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తరుణంలోనే ఫాల్కే అవార్డుకు వహిదా రెహమాన్ ఎంపిక కావడం గర్వకారణమని ఒక ట్వీట్‌లో అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa