జీవీఎంసీ 30వ వార్డు బుచ్చిరాజుపాలెం ఎన్ఎస్ఓఎల్ వెనుక గోడ సమీపం నుంచి ఇళ్లల్లోకి మంగళవారం కొండచిలువ రావటంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇంటి కాంపౌండ్ వాల్లోకి వచ్చి బాత్ రూమ్‌కు సమీపంలోని పొదల్లో దూరటంతో విషయాన్ని స్నేక్ స్నేచర్ కిరణ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో కిరణ్ అక్కడకు చేరుకొని సుమారు 8 అడుగుల కొండచిలువను పట్టుకొని తీసుకెళ్లారు. దీంతో అక్కడి వాసులంతా ఊపిరిపీల్చుకున్నారు.