మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వారికి న్యాయస్థానం జరిమానా విధించింది. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మురళీ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న 14 మందిపై కేసులు నమోదు చేశారు. వారిని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరచగా అందరికీ కలిపి మొత్తంగా రూ.49 వేల జరిమానా విధించారు.