తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో బుధవారం పెను ప్రమాదం తప్పింది. నాలుగవ కిలో మీటరు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa