జియ్యమ్మవలస మండలం రామినాయుడువలస గ్రామ పంటపొలాల్లో 7 ఏనుగులు సంచరిస్తున్నాయని, ఒంటరి ఏనుగు కొమరాడ మండలం అంకుల్ వలస లో, మరో నాలుగు ఏనుగులు కురుపాం మండలం జరడ సమీపంలో ఉన్నాయని అధికారులు గురువారం తెలిపారు. దాంతో ప్రజలను, రైతులను అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేశారు. గజరాజులు గ్రామ సమీపంలో పంట పొలాల్లో సంచరిస్తుండడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో అని సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.