ఆంధ్రా-ఒరిసా సరిహద్దులో బుధవారం చీకటి పడుతున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మన్యం జిల్లా నారాయణపట్నం లోయలో బైక్ బోల్తాపడి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మక్కువ మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన జయరాజు, బాలరాజు, శివగా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.