విజయనగరం పీవీజీనగర్ లో ఈ నెల 19న జరిగిన దొంగతనం కేసును టుటౌన్ పోలీసులు కేసును ఛేదించారు. బిరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు చోరీ జరిగినట్లు పూల్ బాగ్ కు చెందిన పొన్నాడ అప్పలరాజు పోలీసులకు పిర్యాదుచేసారు. విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం పటాన్ అస్లామ్, షేక్ షాజన్లను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి బంగారు ఆభరణాలు, రూ. 6లక్షల నగదును స్వాధీనం చేసుకొని, రిమాండ్ కు తరలించినట్లు సిఐ విజయనంద్ తెలిపారు.