కొత్తవలస మండల కేంద్రం స్థానిక సాయి నగర్ కు చెందిన ఒమ్మి భాస్కరరావు (38) అనే వ్యక్తి అప్పులు బాధలు తాళలేక బుధవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో విశాఖ కేజీహెచ్ కు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.