గుంటూరు జిల్లాలో ఆశాజనకంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా మేడికొండూరు మండలంలో 72 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో 2. 4 మి. మీ వర్షం పడింది. సగటున 23 మి. మీ వర్షపాతం నమోదైంది. ఫిరంగిపురం 66. 6, పొన్నూరు 54. 2, కాకుమాను 39. 4, తుళ్ళూరు 38. 6, తాడికొండ 29. 2 మి. మీ వర్షపాతం నమోదైంది.