నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో నడుస్తున్న స్కిల్ సెంటర్‌ను బుధవారం టీడీపీ నేతలతో కలిసి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సందర్శించారు. అక్కడున్న పరికరాలు, ల్యాప్‌టా్‌పలు, ఇతర సామగ్రిని, నూతనంగా నిర్మించిన నైపుణ్యాభివృద్ధి భవనాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ..... సీఎం జగన్‌రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికే మంత్రి కాకాణి పని చేస్తున్నాడు. వీఎ్‌సయూలో డాక్టరేట్ పొందిన కాకాణికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా జరుగుతున్న కార్యకలాపాల గురించి తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులే రాకుండా చేశారని విమర్శించారు.