తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు స్కిల్ కేసును సీబీఐతో విచారించాలని, హైకోర్టులో ఉండవల్లి కేసు వేశారు. అసలు ఆ కేసులో పస ఉందా? ఆ కేసుకు సంబంధించి ఆధారం ఉందా? చంద్రబాబు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి ఓ రూపాయి అయినా వెళ్లినట్టు ఉందా? చంద్రబాబును బయట తిరగరాదనే దురుద్దేశంతో జగన్ కుట్రలు పన్నుతుంటే దానికి ఉండవల్లి సహకరిస్తున్నారు. ఉండవల్లి సీఎం జగన్ దర్శకత్వంలో మాట్లాడతాడా? ఉండవల్లీ... మేధావివా... మేతావివా? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. విశ్లేషణ నిష్పక్షపాతంగా చేయాలి తప్ప... ఓ వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరించడం సరికాదు. కుట్రదారులతో కుమ్మకై నిజాయితీని, వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు’’ అని అయ్యన్న విజ్ఞప్తి చేశారు.