ఇండియా టుడే, సీ ఓటర్ సర్వేలో వైసీపీకి 3 స్థానాలకు మించి రావని వచ్చినప్పటికీ, 175 స్థానాల్లో గెలుస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు’’ అని మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు విమర్శించారు. ఆయ న బుధవారం ఈమేరకు ఓ ప్రకటన చేశారు. ‘‘వైసీపీ అరాచక, దౌర్జన్య, మోసపూరిత పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా ‘నిన్ను భరించలేం జగన్‌రెడ్డీ’ అంటున్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని నలభై ఏళ్లు వెనక్కి నెట్టి సిగ్గు లేకుండా మళ్లీ జగనే కావాలంటూ ప్రచారం చేస్తారా? ఎన్ని గేర్లు మార్చినా బోరుకు వచ్చిన బండి నడవదు’’ అని కళా వెంకట్రావు ఎద్దేవా చేసారు.