ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే. .... నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన ముప్పిడి కిరణ్ (19) డెయిరీ ఫారంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఈ మేరకు విషయం అమ్మాయికి చెప్పడంతో ఆమె ఒప్పుకో లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు గోపవరం సమీపంలోని పశువుల చావిడి వద్ద మంగళ వారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి మందలయ్య బుధవారం సమిశ్రగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏఎస్ఐ పరమహంస కేసు నమోదు చేశారు.