కర్నూలు జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్న వారి కోసం అటవీ అధికారులు రిక్కీ నిర్వహించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆత్మకూరు పట్టణంలోని చర్కాకాలనీకి చెందిన సాంబశివరావు, వెలుగోడుకు చెందిన షేక్ గాజుల యూసూఫ్, పాములపాడు మండలం కృష్ణానగర్‌కు చెందిన నీలా వెంకటశివుడు, గడివేముల వెంకటేశ్వర్లు, గట్టుతండాకు చెందిన కుడావత్ జయరామ్‌నాయక్ అనే వ్యక్తులు గుండ్లబ్రహ్మేశ్వరం అభయారణ్యంలోకి అక్రమంగా ప్రవేశించి తిరుమలదేవుడి కొండ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేటను కొనసాగించినట్లు చెప్పారు. బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఫారెస్ట్ పెట్రోలింగ్‌కు వెళ్లగా అక్కడ నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను కర్నూలు కోర్టులో మెజిస్ర్టేట్ ఎదుట హాజరుపర్చిటన్లు వివరించారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్‌వోలు పెద్దయ్య, మధుబాబు, ఎఫ్‌బీవో కుమార్, యాంటి పోచింగ్ ఎఫ్ఎస్వో మల్లేష్ తదితరులు ఉన్నారు.