ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముదినేపల్లి మండలం కోమర్రు శివారు చినకోమర్రులో విషాద సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... గ్రామానికి చెందిన తేలు సాయి (25) అనే యువకుడు కొరియర్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం పచ్చగడ్డి కోసం గ్రామ సమీపంలోని చేపల చెరువు గట్టుకు వెళ్లాడు. గడ్డి కోస్తుండగా కత్తి విద్యుత్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న సాయి మరణం కోమర్రులో విషాదాన్ని నింపింది. సర్పంచ్ కూనపరెడ్డి శ్రీసాయి కృష్ణ తదితరులు సాయి మృతికి సంతాపం తెలిపారు.