ప్రభుత్వ పాఠశాలలలో డిజిటల్ చదువు కోసం ఒప్పదం చేసుకున్న బైజూ్‌సకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘‘అవగాహన లేని వారు, అధ్యయనం చేయకుండా బైజూస్ ఏపీ ప్రభుత్వం కమర్షియల్ ఒప్పందం చేసుకుందని, డబ్బులు ఇస్తున్నామని ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ దావోస్ వెళ్లినప్పుడు బైజూస్ వాళ్లని కలిసి, విద్యార్థులకు కంటెంట్ ఇవ్వాలని కోరారు. సీఎం అభ్యర్థన మేరకు వారు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటెంట్‌ను ఉచితంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ ప్రకారమే మేం ఎంవోయూ చేసుకున్నాం’’ అని వివరించారు.