‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై ఇంకా లోతైనా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి తెలిపారు. బుధవారం రీతూరాజ్ నేతృత్వంలో భేటీ జరగ్గా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ ప్రకటనపై ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ రిపోర్ట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదని వెల్లడించారు. కాగా, జమిలిపై కేంద్రం ఇటీవలే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ప్యానెల్ ఏర్పాటు చేసింది.