ఎంఎస్ స్వామినాథన్ మరణం భారత వ్యవసాయ రంగానికి తీరని లోటని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ...‘‘స్వామినాథన్ ఆత్మకు శాంతి చేకూరాలి. మన దేశంలో హరిత విప్లవానికి ఊపిరి పోసి వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. స్వామినాథన్ తుది శ్వాస విడిచారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. స్వామినాథన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పన చేయడం వల్లే ఆ దిశగా ఎన్నో ప్రయోగాలు నేటికీ మన దేశంలో సాగుతున్నాయి’’ అని పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.