జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బోడె ప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా పోరంకిలోని తన నివాసంలో బోడె ప్రసాద్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘సీఎం జగన్కు మీడియా సహాయం లేదు అంటున్నారు. సాక్షి ఎవరి మీడియా వైసీపీ అనుకూల మీడియా కాదా?, పోలీసులతో ప్రజా ఉద్యమాలు అణచివేయిస్తున్నారు. ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే వైసీసీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుంది.’’ అని తెలిపారు.